12 April, 2026 | 2:23 AM

హ్యాట్రిక్‌పై లక్నో గురి

12-04-2026 12:38 AM

గుజరాత్‌తో మ్యాచ్

లక్నో, ఏప్రిల్ 11 : ఐపీఎల్ 19వ సీజన్ లో ఆదివారం డబుల్ హెడర్ అభిమానులను అలరించబోతోంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ , గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి తొలి మ్యాచ్ లో ఓడినా తర్వాత వరుసగా రెండు విజయాలతో లక్నో మంచి జోష్ మీద కనిపిస్తోంది. ముఖ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ పై సంచలన విజయం తర్వాత లక్నో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్ తో ఇప్పుడు కీలక ప్లేయర్ గా మారిపోయాడు.

ఓపెనర్లు మార్కరమ్ , మిఛెల్ మార్ష్ ఇచ్చే ఆరంభాలకు తోడు పంత్ , బదౌనీ, పూరన్ కూడా తోడైతే తిరుగుండదు. అటు బౌలింగ్‌లో మహ్మద్ షమీ మంచి ఫామ్ లో ఉన్నాడు. అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. అతనితో పాటు అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ కూడా రాణిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్న స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రతి  కూడా కీలకంగా ఉన్నాడు. మరోవైపు ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఒకే ఒక మ్యాచ్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ రెండింటిలో పరాజయం పాలైంది.

పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. గెలిచిన ఒక మ్యాచ్ కూడా కేవలం 1 పరుగు తేడాతో గట్టెక్కింది. బ్యాటింగ్‌లో గిల్ ఫామ్ లోకి రావడంతో పాటు బట్లర్ , సాయి సుదర్శన్ , గ్లెన్ ఫిలిప్స్ కూడా చెలరేగితో గుజరాత్ ను అడ్డుకోవడం కష్టమే. అటు బౌలింగ్ లో మాత్రం మెరుగు పడాల్సిన అవసరం ఉంది.

పేస్ విభాగంలో రబాడ, సిరాజ్ ,  ప్రసిద్ధ కృష్ణ కీలకంగా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ తన మ్యాజిక్ చూపించలేకపోవడం కూడా ఇబ్బంది కలిగిస్తోంది. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 7 మ్యాచ్ లలో తలపడగా గుజరాత్ నాలుగు సార్లు గెలిచింది. లక్నో మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న లక్నో పిచ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుందని అంచనా.

తుది జట్లు అంచనా 

లక్నో సూపర్‌జెయింట్స్: మిఛెల్ మార్ష్, మాక్రమ్, పంత్(కెప్టెన్), పూరన్, బదౌనీ, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరీ, సిద్ధార్థ్, అనేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్

గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, ప్రసిద్ధ కృష్ణ, సిరాజ్, అశోక్ శర్మ