12 August, 2026 | 10:56 AM

జడ్చర్ల బస్టాండ్ లో లైవ్ ట్రాకింగ్ ప్రారంభం

12-08-2026 09:53 AM

జడ్చర్ల : ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ జడ్చర్ల బస్టాండ్లో సరికొత్త జీపీఎస్ లైవ్ ట్రాకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. గంటల తరబడి బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు బస్టాండ్ లో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. జడ్చర్ల బస్టాండ్ బస్ కంట్రోలర్ జయప్రకాష్ వివరాల ప్రకారం... టీవీ తెరలపై బస్సు ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎంత సమయానికి బస్టాండ్  చేరుకుంటుందనే? వివరాలు నిరంతరం ప్రసారమవుతాయి.

బస్సు నంబర్, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ ప్లాట్ఫాంపైకి వస్తుందనే పూర్తి సమాచారం డిస్ప్లే అవుతుంది.టీవీ స్క్రీన్లకు దూరంగా ఉన్న ప్రయాణికుల కోసం మైకుల ద్వారా ఆడియో అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నారు.నిత్యం తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 1000 బస్సులు రాకపోకలు సాగించే జడ్చర్ల బస్టాండ్ కు ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన బస్టాండ్ లో ఈ విధానాన్ని విస్తరిస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.