రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
02-08-2026 12:18 AM
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన వర్షాలు మళ్లీ కాస్త నెమ్మదించాయి. అయితే రాష్ట్రం లో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా 30-40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితలత గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈ గాలులు బలంగా వీస్తాయని తెలిపింది. ఆది, సోమ, మంగళవారాల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది.






