గ్రంధాలయాలు సమాజాభివృద్ధికి పునాదులు
మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 5 (విజయక్రాంతి): గ్రంధాలయాలు సమాజాభివృద్ధికి పునాదులు వేస్తాయని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన గ్రంథాలయ చైర్మన్ కామ్డే అనిల్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుమేత విశ్వనాధ్ లను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ గ్రంథాలయాలు సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తాయని, యువత భవిష్యత్తు చదువుతోనే నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. నూతన చైర్మన్ నాయకత్వంలో గ్రంథాలయ సేవలను గ్రామీణ స్థాయికి విస్తరించాలని సూచించారు. ప్రజలకు జ్ఞానం అందించే కేంద్రాలుగా గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ , నాయకులు సాయి, పెందూరు ప్రకాష్ , రాజేందర్, బండి సాయి, హైదర్, ధనురా సర్పంచ్ మిశ్రమ భూపతి, సర్పంచ్ జానే రావు తదితరులు పాల్గొన్నారు.






