30 August, 2026 | 4:32 PM

కుర్తివాడలో వైభవంగా అఖండ శివనామ సప్తాహం ప్రారంభం

30-08-2026 04:07 PM

పాపన్నపేట, ఆగస్టు 30: పాపన్నపేట మండలం కుర్తివాడ ప్రధాన రహదారి వద్ద ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ పెద్దలు, భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు నిర్విరామంగా "ఓం నమః శివాయ" నామస్మరణ జరుగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆలయ అర్చకులు శ్రీ రమేష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించి సప్తాహాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల భజన మండళ్ల సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. శ్రావణ మాసంలో శివనామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని, భగవంతుని అనుగ్రహం లభిస్తుందని అన్నారు.