1 March, 2026 | 3:14 AM

గర్భాశయ క్యాన్సర్‌ను తరిమికొడదాం

01-03-2026 12:57 AM
  1. దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్
  2.   9- 14 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా టీకా
  3. మిషన్ ఇంధ్రధనుష్ తరహాలో విజయవంతం చేస్తాం: ప్రధాని మోదీ
  4. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో టీకా పంపిణీ షురూ

జైపూర్/హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌ను తరిమికొడదామని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల్లో టీకా ఉచితంగా లభిస్తుందని వివరిం చారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా శనివారం ఆయన దేశవ్యాప్త హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రారంభించారు.

ప్రధాని నేతృత్వం లో వైద్యసిబ్బంది 9- 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా వేశారు. మోదీ ఈ సందర్భంగా బాలికలతో ముచ్చటించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ వల్ల ఏటా లక్ష మందికిపైగా మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతు న్నారని, 80 వేల మంది మహిళలు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్యాన్సర్‌ను తరిమికొట్టేందుకు మి షన్ ఇంధ్రధనుష్ తరహాలో ఈ కార్యక్రమా న్ని కూడా విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.

టీకాకు బాలికల తల్లిదండ్రుల లిఖితపూర్వక ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. టీకా తర్వాత, ఒకవేళ బాలికల్లో అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యబృందమే చికిత్స అందిస్తుందని భరోసానిచ్చారు. స్కూళ్లు, కాలేజీలు, స్థానిక కమ్యూనిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున టీకాపై అవగాహన సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.