15 June, 2026 | 3:33 PM

Breaking News

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి   •   ఓట్ చోరీ, సీట్ చోరీ చేసేది కాంగ్రెస్సే: రామచందర్‌రావు   •   ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ   •   కిరాతకుడుని ఉరితీయాలి..   •   కేటీఆర్ ను కలిసిన పట్టణ అధ్యక్షులు   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •  

నాయకులారా సమస్యలు చెప్పండి.. సత్వరం పరిష్కరిద్దాం

19-01-2026 12:00 AM

రెండవ వార్డ్‌లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, జనవరి 18 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్  విస్తృతంగా పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అభివృద్ధి పనుల పురోగతిని ఆయన నేరుగా పరిశీలించారు. వార్డు ప్రజలతో ఎమ్మెల్యే మదన్ మోహన్  సన్నిహితంగా మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

స్థానికులు తమ సమస్యలను ప్రత్యక్షంగా ఎమ్మెల్యేకి వివరించగా, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు ప్రస్తావించిన చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే అధికారులు నోట్ చేసుకునేలా ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల్లో తమ వార్డులో ఈ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని, కేవలం మదన్ మోహన్ ఎమ్మెల్యే  అయ్యాకే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

గత రెండు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే మదన్ మోహన్  కృషిని ప్రజలు ప్రశంసించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ ఏఈఈ పెండింగ్లో ఉన్న పనులు, ప్రజల సమస్యలను నమోదు చేసుకొని, వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ వార్డు అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.