28 June, 2026 | 2:03 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఈ మహాసభలు మరెన్నో పోరాటలకు వేదిక కానున్నాయి

21-04-2026 07:36 PM

మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన నేతలు

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు మరెన్నో ఉద్యమాలకు, రైతు సమస్యల పోరాటాలకు వేదిక కానున్నాయని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ లు తెలిపారు. ఈ నెల 23 నుండి మూడు రోజుల పాటు స్థానిక కొత్తగూడెం క్లబ్లో జరగనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ సభల ఏర్పాట్లు, వసతులు, సౌకర్యాలను పోతినేని మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరంపోస్ట్ ఆఫీస్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పొతినేని మాట్లాడారు. జిల్లా రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు ఈనెల 23, 24, 25 జరగబోతున్నాయని,  ఈ మహాసభల కోసం కొత్తగూడెం పట్టణంలో ఏర్పాటు అన్ని పూర్తయ్యాయి. పట్టణమంతా రైతు సంఘం జెండాలు, తోరణాలు,  ముఖ్య నేతల ప్లెక్సీలతో  అలంకరించడం జరిగిందని తెలిపారు. డెకరేషన్, వసతులు, హాలు అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమైందని, మహాసభలో ఏర్పట్ల విషయంలో కొత్తగూడెంలోని ప్రజాతంత్ర ఉద్యమం, ప్రత్యేకించి   ఆహ్వాన సంఘం బాధ్యత తీసుకుంది. ఏర్పాటులను కూడా చాలా జయప్రదంగా నిర్వహిస్తామన్నారు.

మూడు రోజులపాటు జరిగె ఈ మహాసభల్లో రైతాంగం ఎదురుకుంటున్న ప్రధానమైన సమస్యలు రాష్ట్రంలో కానీ, దేశంలో గాని వ్యవసాయ రంగం, రైతన్న ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభల్లో చర్చించబోతున్నామన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో దేశంలో, రాష్ట్రంలో జరిగినటు వంటి వ్యవసాయ పోరాటాల గురించి సమీక్ష చేయబోతున్నాం. అనుభవాలను  సమీక్షించుకొని  గుణ పాఠాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకొని రాబోయే కాలంలో భవిష్యత్తు రైతాంగ ఉద్యమ నిర్మాణానికి, రైతు సమస్యల  పరిష్కారానికి అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందించడం కోసం సిద్ధం కానునట్లు తెలిపారు ఈ మహాసభల విజయవంతనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షలు  మచ్చ వెంకటేశ్వర్లు,  రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే. రమేష్,  తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎలమంచిలి వంశీకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాకార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి,  సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి  భూక్యా రమేష్, కాట్రాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.