2 September, 2026 | 1:24 PM

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు కూలీలకు గాయాలు

02-09-2026 | 12:31pm

జడ్చర్ల,: జడ్చర్ల సమీపంలోని నాగసాల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం(Road accident)చోటుచేసుకుంది. నాగసాల నుంచి జడ్చర్ల వైపు బైక్‌పై ఇద్దరు కూలీలు వస్తుండగా, కొల్లాపూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొట్టినట్లు సమాచారం. బస్సు వేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు కూలీలు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.