సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.
టాప్ మార్కులతో.... 30 మంది విద్యార్థుల విజయ దుందుభి.
జవహర్ నగర్/దమ్మాయిగూడ,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించిన సైనిక స్కూల్ ప్రవేశ పరీక్ష (ఏఐఎస్ఎస్ఈఈ) 2026 పరీక్షా ఫలితాల్లో దమ్మాయిగూడ క్రాంతి కీన్ అకాడమీ విజయ దుందుబి మోగించింది. ఈ పరీక్షలో అకాడమీకి చెందిన విద్యార్థుల్లో 260 కంటే ఎక్కువ మార్కులు 30 మంది విద్యార్థులు సాధించడం విశేషం. గత 20 సంవత్సరాలుగా విద్యారంగంలో అనేక సేవలు అందిస్తున్న క్రాంతి కీన్ అకాడమీ నాయకత్వం విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా క్రాంతి కీన్ అకాడమీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ సైనిక్ స్కూల్స్లో సీబీఎస్ఈ విధానంలో నాణ్యమైన విద్యతో పాటు ఆర్మీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇవ్వబడుతుందని క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను, నైతిక విలువలను, సామాజిక లక్షణాలను, అభివృద్ధి చేస్తూ దేశ రక్షణ రంగానికి భవిష్యత్ నాయకులను తయారు చేయడంలో సైనిక స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. క్రాంతి కీన్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ మార్కుల సాధించడం గర్వంగా ఉందన్నారు. ఏఐఎస్ఎస్ఈఈ 2026 ఫలితాల్లో వరుసగా శౌర్య (381మార్కులు), ప్రతీక్ యాదవ్ (276 మార్కులు), శ్రీ వాస్తవ రెడ్డి (376 మార్కులు), ఫల్గుణి(276 మార్కులు), ధ్రువ తేజ్ (272 మార్కులు), అన్షు మన్ (272 మార్కులు), నిహాల్( 270 మార్కులు) యశ్ దీప్ (270 మార్కులు) సాధించారని ఈ ఫలితాలు మా అకాడమీకి గర్వకారణం అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్తమ ర్యాంకులతో విజయ దుందుభి మోగిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి




