5 March, 2026 | 8:14 PM

కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం

05-03-2026 05:09 PM

కంగ్టి,(విజయక్రాంతి): కరెంట్ షాక్ తగిలి రైతుమృతి చెందిన సంఘటన కంగ్టి మండలంలోని చాప్ట (బి )గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంభ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాలాజిరావు (43)అనే రైతు  తనపోలంలో మొక్కజొన్న పంటకు వాగులో నీటిని మోటారు ద్వారా వదులుతాడు,ఈ క్రమంలో రోజువారీగా గురువారం ఉదయం నీటిని పారబెట్టేందుకు మోటారు దగ్గరికి వెళ్లి స్టాటర్ ముట్టాడు అంతలోనే స్టాటర్ లోని ఒకవైరు ప్రమాదవశత్తు తెగి కాలిపైన పడడంతో విద్యుత్ షాక్ తగలి అక్కడికక్కడే మృతిచెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వ్యవసాయమే వారి కుటుంబానికి జీవన ఆధారం కావడంతో ఇంటి పెద్దను కోల్పోవడంతో వారి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని కుటుంభ సభ్యులు గ్రామస్తులు కోర్టుతున్నారు. భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గారెడ్డి తెలిపారు.


ఇవి కూడా చదవండి:

మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ

సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.