28 June, 2026 | 3:52 PM

Breaking News

పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •  

నకిలీ కాఫీ, సిగిరెట్ పాకెట్లు పట్టుకున్న కోదాడ పోలీసులు

30-04-2026 12:29 AM

కోదాడ ఏప్రిల్ 29: కోదాడ కేంద్రంగా సాగుతున్న నకిలీ కాఫీ, సిగరెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం పట్టణ సీఐ శివశంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు  ఇతర సరుకులు తెచ్చి కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా విక్రయిస్తున్న ముఠాపై  విశ్వసనీయత సమాచారం మేరకు దాడులు నిర్వహించి వెంకటేశ్వర నగర్ లో పట్టుకున్నట్లు తెలిపారు.

ఈ దాడుల్లో సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇతర సరుకులను సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో పావులూరి నారాయణమూర్తి, అనుప్ అగర్వాల్, సతీష్ ఏడిద అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్లో కూడా తీసుకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకేజింగ్ చేసి, అమాయక వినియోగదారులను మోసం చేస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యతలేని పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరించారు.