11 August, 2026 | 4:49 AM

ఘర్షణలకు కేరాఫ్ కిసాన్‌నగర్

11-08-2026 12:12 AM
  1. కాలనీవాసులను బెంబేలెత్తిస్తున్న వరుస ఘటనలు
  2. చిచ్చు పెడుతున్న రాజకీయ విభేదాలు
  3. రెచ్చిపోతున్న యువత 
  4. దృష్టి పెట్టాలని పోలీసులకు స్థానికుల విజ్ఞప్తి           

కరీంనగర్, ఆగస్టు10(విజయ క్రాంతి): కరీంనగర్ కిసాన్ నగర్లో చోటుచేసుకున్న వరుస సంఘటనలు వివాదాలు. రాజకీయ ఉద్రిక్తతలు కాలనీ వాసులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. .కిసాన్ నగర్ లో ఆదివారం యువకుల మధ్య జరిగిన ఘర్షణ మరోమారు ఉద్రిక్తత కు దారి తీసింది. ఇక్కడ ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అయ్యాయి. బి జె పి కార్పొరేట్ప హత్యాయత్నం సంఘటన జూన్ 17న జరిగింది. 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ బ్పై ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. తొలుత సాధారణ ప్రమాదంగా భావించినా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్యాయత్నంగా తేల్చి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 2026 మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో కిసాన్ నగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కు కారణమయింది.. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు పోలీసు అధికారుల మధ్య భారీ వాగ్వాదం చోటుచేసు కున్న సంఘటన రాజకీయ ప్రకంపన సృష్టించింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ కిసాన్ నగర్లో బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, మరో కార్యకర్త వద్ద పెద్దఎత్తున నగదు లభించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. గతంలో 12 ఏళ్ళ క్రితం హొలీ పండుగ రోజు ఒక వ్యక్తి వరుస హత్యలకు పాల్పడటం సంచలనం రేపింది. తిరిగి ఆరునెలలు గా చోటుచేసుకుంటున్న సంఘటనలు కాలనీ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఆదివారం కిసాన్ నగర్ లో జరిగిన గొడవలో బిఆర్‌ఎస్ కార్యకర్త గుగులోతు శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బిజెపి చెందిన కార్యకర్తలు బీరు సీసాతో శ్రీకాంత్ పై దాడికి దిగి గాయపరిచారు. కొంతకాలంగా కిసాన్ నగర్ ప్రాంతంలో బిజెపి బిఆర్‌ఎస్ వర్గాలకు చెందిన కొందరు గొడవ పడుతున్నారు ఓపెన్ జిమ్ వద్ద విందు చేసుకుంటున్న రెండు గ్రూపుల మధ్య చిన్న వివాదం తో మొదలై బీరు సీసాలతో దాడి చేసే వరకు వెళ్ళింది. కిసాన్ నగర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు గస్తీని , తనిఖీలను మరింత కఠినతరం చేయాలని కాలనీ వాసులు కోరూతున్నారు.