1 May, 2026 | 2:22 AM

కింగ్ మేకర్!

01-05-2026 01:06 AM

టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్: టీవీకే 52-74, డీఎంకే 114-136, అన్నాడీఎంకే- 34-56

విజయ్‌తో పొత్తుకు ఎన్డీఏ తహతహ

చెన్నై, ఏప్రిల్ 30 : తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి వస్తుందంటూ యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఒకవైపు.. టుడేస్ చాణక్య గురువారం వెలువరించిన ఎగ్జిట్ పోల్ మరొకవైపు విజయ్‌ని కిం గ్ మేకర్‌గా చేస్తున్నాయి. దీంతో విజయ్‌తో పొత్తు కోసం గతంలోనే తీవ్రంగా యత్నించిన అన్నాడీఎంకే--బీజేపీ కూటమి ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగింది.

విజయ్‌తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీవీకేకు ౫౨ నుంచి ౭౪ స్థానాలు లభిస్తాయని అంచనా. డీఎంకేకు ౧౧౪ నుంచి ౧౩౬, అన్నాడీఎంకే-కు ౩౪ నుంచి ౫౬ సీట్లు వస్తాయ ని టుడేస్ చాణక్య అంచనా వేసింది. 234 మంది సభ్యుల అసెంబ్లీలో టీవీకే గెలిచే స్థానా ల సంఖ్యను బట్టే విజయ్ పాత్ర ఉండనుంది. ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని జరిపిన సర్వేల్లో విజయ్‌కి 37% మద్దతు, ప్రస్తుత సీఎం స్టాలిన్‌కు 35% మంది ఓటు వేశారు.

టీవీకేకు 98--120స్థానాలను, డీఎంకే కూటమి 92--110, ఎన్టీయే 32 స్థానాలను గెలుచుకుంటాయని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసింది. ఈ సర్వే నిజమైతే విజయ్‌కు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేందుకు కూడా ఎన్డీఏ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. సర్వే వివరాల ప్రకారం.. 18 నుండి 19 ఏళ్ల వయసున్న తొలిసారి ఓటర్లలో ఏకంగా 68 శాతం మంది విజ య్ వైపే నిలిచారు.

అలాగే 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లలో మెజారిటీ మద్ద తు టీవీకేకే లభించింది. విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లతో పాటు ఓబీసీ, ఎస్సీ మరియు మైనారిటీ వర్గాల్లో కూడా టీవీకే బలమైన పట్టు సాధించింది. మే 4న వెలువడను న్న ఫలితాలు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును ఎలా మారుస్తాయనేది వేచి చూడాలి.