04-02-2026 12:00:00 AM
బీజేపీ అధిష్ఠానం అధికారిక ప్రకటన
ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు తెర
ఇంఫాల్, ఫిబ్రవరి 3: మణిపూర్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారం ఆ పార్టీ నేత యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్‌ను ఎంపిక చేసింది. తాజా పరిణామంతో రాష్ట్రంలో ఇక రాష్ట్రపతి పాలనకు తెరపడనుంది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఉద్రిక్తల కారణంగా అప్పటి సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. ఆ గడువుపూర్తికి కొన్ని రోజుల ముందే బీజేపీ అధిష్ఠానం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్ సింగ్‌ను ప్రకటించింది.
రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలు ఉండగా, వాటిలో బీజేపీకి 37 మంది సభ్యుల బలం ఉంది. ఖేమ్‌చంద్ సింగ్ సొంత నియోజకవర్గం సింగ్జామీ. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన సేవలందించారు. కాగా, ఆ రాష్ట్ర శాసనసభ గడువు వచ్చే ఏడాది వరకూ ఉంది.