ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిశీలించిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్
25-08-2026 03:42 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ పరిశీలించారు. ఈ మేరకు ఇటీవల పాఠశాల తలుపులు పగలగొట్టి టేబుల్ లను, ఫ్యాన్లు ధ్వంసం చేసిన వారిని పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు గురువులను, తల్లిదండ్రులను గౌరవించి విద్యను అభ్యసించాలని పాఠశాల సమస్యలన్నీ తాము తీరుస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొప్పారపు సత్యవతి, నాయకులు ఎనగందుల నారాయణ, ప్రకాష్ గౌడ్ ,పట్టణ అధ్యక్షులు మనోజ్ ,కాశి వేణి ప్రణయ్, ఆసం ఉదయ్, తదితరులు ఉన్నారు.






