10 April, 2026 | 3:18 AM

హిజ్బుల్లా కీలక నేత హతం

10-04-2026 01:22 AM
  1. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
  2. హజ్బుల్లా చీఫ్ నయీమ్ ఖాసీం పర్సనల్ సెక్రటరీ అలీ యూసఫ్ హర్షీ మృతి: ఐడీఎఫ్
  3. ఒక్క రోజులో 254 మంది మృతి.. 1,165 మందికి పైగా గాయాలు
  4. పూర్తిగా ఒప్పందం అమలయ్యే వరకు అక్కడే మా సైన్యం 
  5. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
  6. ఒప్పందం విఫలమైతే అమెరికాదే బాధ్యత: ఇరాన్
  7. పాక్ మధ్యవర్తిత్వంపై మాకు నమ్మకం లేదు 
  8. భారత ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ 

బీరుట్/టెహ్రాన్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నయీమ్ ఖాసీం అల్లుడు, పర్సనల్ సెక్రటరీ అలీ యూసఫ్ హర్షి మృతి చెందాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ దాడుల్లో లెబనాన్‌లో ఒక్క రోజే 254 మందికి పైగా మరణి ంచగా, మరో 1,165 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు పూర్తి కాల్పుల విరమణ పూర్తి ఒప్పందం అమలయ్యే వరకూ ఇరాన్ చుట్టూ అమెరికా సైన్యం, యుద్ధనౌకలు ఉం టాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇంకోపక్క సీజ్ ఫైర్ విఫలమైతే అమెరికాదే పూర్తి బాధ్యత అని ఇరాన్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే పాక్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని భారత ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లెబనాన్‌పై భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా చీఫ్ పర్సనల్ సెక్రటరీ అలీ యూసఫ్ హర్షీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గురువారం ప్రకటించింది. బుధవారం రాత్రి బీరుట్‌పై జరిపిన దాడ్లుల్లో అలీ యూసఫ్ చనిపోయారని.. హిజ్బుల్లా ఆయుధ రవాణా మా ర్గాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది.

సౌత్ లెబనాన్‌లో 10 ఆయుధ డిపోలు నాశనం నాశనమైనట్లు పేర్కొంది. హర్షీ.. ఖాసిమ్‌కు అత్యంత నమ్మకస్థుడైన సలహాదారు మాత్రమే కాకుండా.. అతని కార్యాలయ నిర్వహణ, భద్రతా వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించేవారని తెలిపింది. అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లం ఘించిందని దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే.

లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ దాడులకు సమాధానం ఇచ్చే హక్కు తమకు ఉందని హిజ్బుల్లా పేర్కొంది. లెబనాన్‌పై కేవలం ఒక్క రోజులోనే ఇజ్రాయెల్ దాడుల్లో 254 మంది మరణించగా.. మరో 1,165 మందికి పైగా గాయపడ్డారు.  కాగా లెబనాన్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బు ల్లా సుమారు 30 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. . 

పాకిస్థాన్ పాత్రపై  సందేహం

అమెరికా, -ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్థాన్ పాత్రపై ఇజ్రాయెల్ సందేహం వ్యక్తంచేసింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఒప్పందం పూర్తిగా అమలయ్యే వరకు మా సైన్యం అక్కడే: ట్రంప్ 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడం కోసం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా.. అనేక ప్రాంతాల్లో దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యే వరకు తమ దేశ యుద్ధ నౌకలు, సైన్యం ఇరాన్, దాని చుట్టూ ఉండే ప్రాంతాల్లోనే ఉంటాయని స్పష్టం చేశారు.

ఒక వేళ ఒప్పందాన్ని అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, మునుపెన్నడూ చూడనంత స్థాయిలో విధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ లోగా అమెరికా సైన్యం విశ్రాంతి తీసుకుంటూ.. తమ తదుపరి మిషన్ కోసం ఎదురు చూస్తుంటుందన్నారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా అణ్వాయుధాలు ఉండొద్దని, హోర్ముజ్‌ను తెరిచి, దాన్ని సురక్షితంగా ఉంచాలని ట్రంప్ తన ట్రూత్‌లో పేర్కొన్నారు.

మేం హిజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తాం : నెతన్యాహు 

అమెరికా, -ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణలో లెబనాన్ భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. బుధవారం రాజధాని బీరుట్‌లో జరిపిన వైమానిక దాడుల్లో, హిజ్బుల్లా నాయకుడు నయీమ్ ఖాసెమ్ కార్యదర్శి, ఆయన మేనల్లుడు అలీ యూసుఫ్ హర్షీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.

‘మేము హిజ్బుల్లాపై బలంతో, కచ్చితత్వంతో, దృఢ నిశ్చయంతో దాడులు కొనసాగిస్తున్నాం. బీరుట్‌లో, హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ సెక్రటరీ-జనరల్ నయీమ్ ఖాసెమ్ వ్యక్తిగత కార్యదర్శి, అతనికి అత్యంత సన్నిహితులలో ఒకరైన అలీ యూసుఫ్ ఖర్షీని మేము హతమార్చాం.

రాత్రికి రాత్రే ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) హిజ్బుల్లాలో వేలాది ఆయుధాలు, రాకెట్లు, లాంచర్లను తరలించడానికి ఉపయోగించే క్రాసింగ్స్‌లు, అలాగే ఆయుధ డిపోలు, లాంచర్లు, హిజ్బుల్లా ప్రధాన కార్యాలయాలపై దాడి చేసింది’ అని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై దెబ్బ కొడతాం అని ఆయన శపథం చేశారు.

ఒప్పందం విఫలమైతే అమెరికాదే బాధ్యత : ఇరాన్

కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా ఇరాన్ మద్దతు పక్షాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో శాశ్వత శాంతి ఒప్పందం అసమంజసమే అవుతుందని వెల్లడించింది. సీజ్‌ఫైర్‌లోని అనేక షరతులను నెతన్యాహు ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆగ్రహించింది. ఇరాన్ హిజ్బుల్లాకు మద్దతుగా నిలుస్తుందని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. సీజ్‌ఫైర్ విఫలమైతే ఆ బాధ్యత అమెరికాదే అని ఇరాన్ హెచ్చరించింది.