2 March, 2026 | 5:44 PM

తెలంగాణలో "బుల్డోజర్ రాజ్": కేరళ సీఎం విమర్శలు

02-03-2026 02:03 PM

తిరువనంతపురం: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో(Velugumatla Bhoodan Land Demolition) ఇటీవల జరిగిన కూల్చివేతపై(demolition drive) కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Kerala CM vijayan) స్పందించారు. ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకిస్తూ తెలంగాణలో "బుల్డోజర్ రాజ్" నడుస్తోందని పినరయి విజయన్ సోమవారం ఆరోపించారు.

ముందస్తు నోటీసు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక తర్వాత, ఇప్పుడు తెలంగాణలో కూడా “బుల్డోజర్ రాజ్”(bulldozer raj) బయటపడిందని, దీనిని “ఆందోళన కలిగించే విషయం”గా విజయన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామం నుండి వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ, ఫిబ్రవరి 25న తెల్లవారుజామున "భూదాన్" భూమిలో నిర్మించిన సుమారు 700 ఇళ్లను కూల్చివేసారని, ఎటువంటి ముందస్తు నోటీసు జారీ చేయకుండానే వాటిని కూల్చివేసారని కేరళ సీఎం పేర్కొన్నారు.