25 February, 2026 | 8:24 AM

బీరప్ప ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు: హరీశ్‌రావు

25-02-2026 01:26 AM

చింతమడక బీరప్ప ఉత్సవాల్లో మాజీ మంత్రి

మృతుల కుటుంబాలకు పరామర్శ

సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 24: మళ్లీ ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చింతమడక గ్రామంలో నిర్వహించిన బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొని బీరప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గ్రామస్తులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారని, బీరప్ప ఉత్సవాలకు సహాయం అందించి గ్రామ ప్రజలను గుర్తు చేసుకున్నారని తెలిపారు.

బీరప్ప స్వామి దయతో, ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరామర్శ సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామానికి చెందిన పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు దొంగల శ్రీకాంత్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను హరీశ్ రావు పరామర్శించారు. అలాగే బచ్చాయిపల్లి గ్రామ పార్టీ సీనియర్ నాయకుడు దుర్గం ఎల్లం తండ్రి మరణించడంతో వారి కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయా కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటానని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.