9 August, 2026 | 3:06 PM

TRS కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు

09-08-2026 01:48 PM

హైదరాబాద్: కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో( Telangana Rakshana Sena office) ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ, బంజారా యోధులు కొమురం భీమ్, ఏకలవ్యుడు, టాను నాయక్ చిత్రపటాలకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడంతో పాటు భావితరాలకు వాటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కవిత పిలుపునిచ్చారు. అటు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ''అడవితో మమేకమై.. ఈ నేలను, ప్రకృతిని కాపాడుతూ భారతీయ సమాజానికి తమదైన గొప్ప విలక్షణ సంస్కృతిని వారసత్వంగా అందిస్తున్న నా ఆదివాసీ సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వావలంబన కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం.'' అంటూ కవిత ఎక్స్ లో పోస్టు చేశారు.