calender_icon.png 6 February, 2026 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాతిపిత కేసీఆర్.. రేవంత్‌రెడ్డి బూతు పిత

06-02-2026 01:14:02 AM

  1. దమ్ముంటే 11లోగా రైతుబంధు వేయి... ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాస్తాం 
  2. అన్నం పెట్టిన కేసీఆర్‌కు అండగా నిలవాలి 
  3. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు

గజ్వేల్, ఫిబ్రవరి5 : ఉద్యమాలు ఆమరణ నిరాహార దీక్షలు చేసి తెలంగాణను సా ధించి కెసిఆర్ జాతిపిత అయ్యాడని, సమస్యల పరిష్కారం గురించి అడిగితే బూతులు తిడుతూ సీఎం రేవంత్ రెడ్డి బూతు బిడ్డ అ య్యాడని  మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడ ర్ హరీష్ రావు అన్నారు. గురువారం ము న్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ యన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో పర్యటించి టిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు.

ప్రభుత్వానికి ఎరువు బ స్తాలు ఇచ్చే, వడ్లు కొనే తెలివి లేదన్నారు. ఇప్పటికే రెండు రైతుబంధులు ఎగ్గొట్టారని, ఎలక్షన్ కోడ్ అడ్డురాదని, బిఆర్‌ఎస్ పార్టీ తరఫున తామే ఈసీకి లేఖ రాస్తామని,  ద మ్ముంటే 11లోగా మూడు పంట కాలాల రై తుబంధు వేయాలన్నారు. లేనిపక్షంలో కాం గ్రెస్ పార్టీని రైతులు చీల్చి చెండాడతారన్నా రు. మనకు అన్నం పెట్టిన కేసీఆర్ ప్రజలు అండగా నిలవాలనం టూ కేసీఆర్ గారి అభివృద్ధిని, రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగ ట్టారు.

గజ్వేల్లో ఎన్నికలు వచ్చాయని, మన కు అన్నం పెట్టిన, పని చేసి మంచిగా చూసుకున్న వాళ్లకే ఓటేయాలన్నారు. కేసీఆర్ రాక ముందు గజ్వేల్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుం దో ఆలోచిం చాలన్నారు. 250 పడకల ఆసుపత్రి తో కార్పొరేట్ వైద్యం, ఆర్డీవో ఆఫీస్, రై లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఊర చెరువు, పాండవుల చెరువు సుందరీకరణ చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కళ్యాణ ల క్ష్మి, షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్ష 116 లు అందించి మేనమామలా ఆదుకున్నది కేసీఆరేనని, అన్ని కళాశాలలు, గురుకులాలు ఏర్పాటు చేసింది కేసీఆరే అ న్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెన్ష న్ అడిగితే లాగుల తొండలు వదులుతా, హా మీలు అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటున్నారని రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్య క్తం చేశారు. ఫ్రీ బస్సు అని మగోళ్లకు డబల్ టికెట్ కొట్టి, ఆడవాళ్లకు తిప్పలు పెట్టారన్నారు. పువ్వు గుర్తు వాళ్ళు ఎన్నడైనా ఒక్క రూపాయి పని చేశారా అని ప్రశ్నించారు. యాదాద్రి నరసింహ స్వామి గుడి కట్టింది కే సీఆర్.

గజ్వేల్ వెంకటేశ్వర స్వామి గుడి, రా మాలయం, శివాలయం అద్భుతంగా కట్టించింది కేసీఆరే నని, పని చేసే వాళ్లకు ఓటే ద్దామా? అక్షింతలు వేసే వాళ్లకు ఓటేద్దామా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, బ్యారేజ్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి, ఆయా వా ర్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.