13 April, 2026 | 11:50 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

భద్రకాళి శరన్నవరాత్రోత్సవాల ముగింపుకు కేసీఆర్‌కు ఆహ్వానం

02-10-2025 12:10 AM

హనుమకొండ అక్టోబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఎర్రవెల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా, అమ్మవారి ప్రసాదాన్ని, అమ్మవారి వద్ద ఉంచిన పట్టువస్త్రాలను అందజేశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి దాస్యం వినయ్ భాస్కర్ దసరా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్నారు.