4 April, 2026 | 11:04 PM

లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం

04-04-2026 08:41 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రాజరాజేశ్వరి కరీంనగర్ ద్వారా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్ మల్కాపూర్ ఎస్సీ కాలనీలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ ద్వారా అవసరార్థులకు  అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తూ16 వ డివిజన్ మల్కాపూర్ కార్పొరేటర్ కంతాల జగన్ రెడ్డి అన్నారు. 

రేకుర్తి కంటి ఆసుపత్రి టెక్నీషియన్ బొంతల ప్రభాకర్ 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 11 మందికి కంటి శస్త్ర చికిత్స అవసరం కాగా వారికి తొమ్మిదవ తేదీన రేకుర్తి కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి లైన్స్ క్లబ్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ కిషన్ రెడ్డి, సీనియర్ క్లబ్ మెంబర్ రాళ్ల బండి శంకర్ ప్రసాద్ రెడ్డి, సంధి మోహన్ రెడ్డి, బొంగోని పరుశురాం, ఎడబోయిన సంజీవరెడ్డి, దువ్వంతులమునిందర్ రెడ్డి పాల్గొన్నారు.