1 July, 2026 | 11:25 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఘనంగా కాష్యపిరెడ్డి జన్మదిన వేడుకలు

21-03-2026 12:05 AM

మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్‌రెడ్డి

కుషాయిగూడ మార్చి 20 (విజయ క్రాంతి) : డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) శుక్రవారం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి కుమార్తె పజ్జు రి కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలను పాఠశాల విద్యార్థుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆడంబరాలకు పోకుండా సమాజానికి ఉపయోగపడేలా, సేవా కార్యక్రమాలతో ఈ వేడుకలను జరపడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు అండగా పీఎంఆర్ సేవా సంస్థ: ఈ సందర్భంగా పీఎంఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులందరికీ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన నీటి సీసాలను (వాటర్ బాటిల్స్) పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పజ్జురి పావని మణిపాల్ రెడ్డి తన కుమార్తె కాష్యపి రెడ్డితో కలిసి విద్యార్థులకు వీటిని అందజేశారు. కాష్యపిరెడ్డికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పా ఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పీఎంఆర్ సేవా సంస్థ ప్రతినిధులు, మట్ట రాజేశ్వర్ రెడ్డి, కరిపే ప్రవీణ్ వంజరి, పొద్దుటూరి గోవర్ధన్, నాగేశ్వర్ రెడ్డి, సింగం రాజు, సంజీవ రెడ్డి, ప్రకాష్, అరుణ్, ఉమేష్, రాజేష్, సాయి నితీష్, రామ్, నిరుపం, సాయి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.