1 August, 2026 | 7:03 PM

Breaking News

తాత్కాలికంగా కాదు.. శాశ్వత పరిష్కారం కావాలి   •   కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •  

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత..

19-11-2025 10:50 PM

కీసరగుట్ట క్షేత్రంలో ప్రత్యేక పూజలు..

కీసర (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kalvakuntla Kavitha) బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కవితకి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, తాను చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం కవితకి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కవిత గారితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో కీసరగుట్ట ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.