6 March, 2026 | 1:33 PM

నాలుగేండ్ల మనోవేదన స్వామివారి దయతో తీరింది: కవిత

06-03-2026 11:54 AM

తిరుమల శ్రీవారి సేవలో కవిత

తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి

తిరుమల: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి(Tirumala Tirupati Devasthanam) దర్శనం చేసుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి కవిత శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ... నాలుగేళ్లుగా పడుతున్న మనోవేదన స్వామివారి దయతో తీరిందని చెప్పారు.

సత్యం, న్యాయం, ధర్మం తనవైపు ఉందని చెబుతూ వస్తున్న మాట నిజమైందని కవిత వెల్లడించారు. మద్యం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు కాలినడకన వచ్చానని వివరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల పక్షాన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆనందం, శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.