calender_icon.png 21 February, 2026 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫీసు ముఖం చూడని జడ్సీలు

21-02-2026 12:00:00 AM

  1. పట్టణ ప్రణాళికలో స్తంభించిన ఫైళ్లు 
  2. మాన్యువల్ ఫైళ్ల కోసం అధికారుల వేధింపులు 
  3. నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): రాష్ర్టంలో భవన నిర్మాణ అనుమతులను పారదర్శకంగా, వేగంగా మంజూరు చేస్తామన్న ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు గారిపోతోంది. అత్యాధునిక సాంకేతికతతో బిల్డ్ నౌ సాప్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చినా, దరఖాస్తుదారుల తిప్పలు మాత్రం తప్పడం లేదు.

అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించాల్సి న జోనల్ కమిషనర్లు కార్యాలయాలకే రాకపోవడం, వచ్చిన ఫైళ్లను నిష్కారణంగా తిప్పి పంపుతుండటంతో నగరంలోని ట్రై కార్పొరేషన్ల జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలో పట్టణ ప్రణాళికా విభాగం పూర్తిగా స్తంభించిపోయింది. వేలాది దరఖాస్తులు వారాల తరబడి పెండింగ్లో ఉండటంతో నిర్మాణదారులు, సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా నగరంలోని పలు జోన్లలో అధికారుల పనితీరు విస్తుపోయేలా ఉంది. అత్యంత కీలకమైన కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ గత 15 రోజులుగా కార్యాలయంలో అడుగు పెట్టలేదని సమాచారం. తన వద్దకు వచ్చిన ఫైళ్లను ఎటువంటి కార ణం లేకుండానే వెనక్కి పంపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉప్పల్ జోనల్ కమిషనర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన ఇప్పటివరకు ఒక్క భవన నిర్మాణ ఫైల్‌ను కూడా పరిష్కరించలేదని తెలుస్తోం ది. శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ల తీరు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు.  

డిజిటల్ ముసుగులో మాన్యువల్..

మంత్రి శ్రీధర్ బాబు బిల్డ్ నౌ పోర్టల్‌ను ప్రారంభిస్తూ.. ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకుని మెరుపు వేగంతో అనుమతులు పొందవచ్చని ప్రకటించారు. కానీ, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం ఆన్ లైన్ దర ఖాస్తులను పట్టించుకోకుండా, మాన్యువల్ ఫైళ్లు పట్టుకుని కార్యాలయాలకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు. అనుమతుల మంజూరులో జాప్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ గా గండి పడుతోంది.

వార్డుల పునర్విభజన, జోన్ల మార్పు సాకుతో అధికారులు ఫైళ్ల కదలికను ఆపేశారు. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, కార్యాలయాలకు రాని జడ్సీలపై చర్యలు తీసుకోవా లని, పెండింగ్ ఫైళ్లను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

బిల్డ్ నౌలో పెండింగ్ ఫైళ్లపై సమీక్ష..

ఎంఎంసీ కమిషనర్ టి వినయ్ క్రిష్ణారెడ్డి రెడ్డి  చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్‌తో కలిసి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించా రు. సిటీ ప్లానర్‌లు అసిస్టెంట్ సిటీ ప్లానర్ లతో జోనల్ సర్కిల్ వారిగా బిల్డ్ నౌ లో పెండింగ్ ఉన్న ఫైల్స్‌పై సమీక్షించారు గడు వు ముగిసిన తర్వాత కూడా ఫైల్స్ పెండింగ్ ఉన్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.