25 April, 2026 | 4:17 PM

వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించడంపై హర్షం

25-04-2026 02:33 PM

*  సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

​అమనగల్: ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంపై ఆర్యవైశ్య సామాజిక వర్గంలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అమనగల్ పట్టణంలో ఆర్యవైశ్యులు సంబరాలు నిర్వహించారు. స్థానిక మార్కెట్ కమిటీ డైరెక్టర్ కండె పాండురంగయ్య గుప్తా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నాయకులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దశాబ్దాల కాలంగా ఆర్యవైశ్యులు కోరుతున్న డిమాండ్‌ను మన్నించి, వాసవి మాత జయంతిని ప్రభుత్వ వేడుకగా ప్రకటించడం శుభపరిణామమని కొనియాడారు. ఈ నిర్ణయం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు​వీరబొమ్మ రామ్మోహన్,​అర్థం లక్ష్మయ్య,​మెండం చంద్రశేఖర్,​బిక్కుమాండ్ల శ్రీను,​జూలూరి సతీష్, ​పాపిశెట్టి అరవింద్,​పసుపుల జగన్, ​విడియాల రవి,​బొజ్జ నర్సింహా,​ఉప్పల శ్రీధర్ మరియు తదితరులు పాల్గొన్నారు.