జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్
మేడ్చల్, ఆగస్టు 18 (విజయక్రాంతి) రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టు సంక్షేమ నిధి కోసం 250 కోట్లు కేటాయిస్తామన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే వచ్చే నెలలో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని మారుతి సాగర్ హెచ్చరించారు.
ప్రెస్ క్లబ్ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలన్నారు. అంతకు ముందు మారుతీ సాగర్ ను ప్రెస్ క్లబ్ కార్యవర్గం మర్యాదపూర్వకంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా టి యూ డబ్ల్యూ జే అధ్యక్షుడు కోల వేంకటేశ్వర్లు, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడు రామారావు , జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడు కే. రవిచంద్ర, జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవీందర్, జిల్లా ప్రెస్ క్లబ్ ఆఫీస్ బేరర్లు కృష్ణ , రవికిరణ్ ,బాల్ రెడ్డి, భూపాల్ , ప్రసాద్,వివిధ పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.






