22 April, 2026 | 2:57 AM

తెలంగాణ జాగృతి పార్టీలో చేరికలు

22-04-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి పార్టీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో పలువురు యువకులు తెలంగాణ జాగృతి పార్టీలో చేరినట్లు మండల తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షులు గౌరీగారి సుభాన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీలో చేర్పించుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి పార్టీ కండువా కాపీ యువకులను సాదరంగా ఆహ్వానించడం జరిగిందన్నారు.ఇటీవల పెద్ద ఎత్తున నాగిరెడ్డిపేట మండలంలో ఆయా గ్రామాల నుండి యువకులు స్వచ్ఛందంగా తెలంగాణ జాగృతి పార్టీలో చేరడంతో నాగిరెడ్డిపేట మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జాగృతి పార్టీ నాయకులు బాగా రెడ్డి, ఖలీల్, ఫయిము, సిద్ధిరాములు, యాదగిరి, జహీర్, సాయిలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.