27 February, 2026 | 10:34 PM

Breaking News

ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం

27-02-2026 08:30 PM

హనుమకొండ,(విజయక్రాంతి): సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ ప్రైవేట్ సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు 25 మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శంకర్ జ్యోతి మాట్లాడుతూ... ఇటువంటి జాబ్ మేళాలు విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడతాయని, ఉద్యోగ అవకాశాలపై అవగాహన పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ జితేందర్, కంపెనీ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.