11న జాబ్ మేళా
08-05-2026 12:00 AM
ఎల్బీనగర్, మే 7: యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సరూ ర్‌నగర్ తహసీల్దార్ పి.వేణుగోపాల్, జీహెచ్‌ఎంసీ సరూర్‌నగర్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివా స్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఒకేషనల్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు ఉన్నవారందరూ జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. 11వ తేదీన ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుం ది తెలిపారు. https://satg.telangana. gov.in/prajapalana/ వెబ్ లింక్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.






