7 June, 2026 | 2:39 AM

గవర్నర్‌ను కలిసిన జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సెలర్

07-06-2026 01:01 AM

కూకట్‌పల్లి, జూన్ 6,(విజయక్రాంతి ): రాష్ట్ర గవర్నర్, జేఎన్టీయూహెచ్ చాన్స్‌లర్ శివ్ ప్రతాప్ శుక్లను వైస్ ఛాన్స్‌లర్ కిషన్ కుమార్ రెడ్డి శనివారం గవర్నర్ అధికారిక నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సెలర్ కిషన్ కుమార్ రెడ్డి జేఎన్టీయూ హెచ్ ఛాన్సెలర్ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లకు 2024 నుంచి 2026 సంవత్సరాల మధ్య కాలంలో విద్యారంగం ఆవిష్కర ణలు, పారిశ్రామిక సహకారం, సంస్థాగత అభివృద్ధి, వివిధ రంగాల్లో విశ్వ విద్యాలయం సాధించిందిన విజయాల గురించి వివరించారు.

జాతీయ విద్యా విధానం 2020, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, విక్సిత్ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా ఉన్న ప్రణాళిక ఆర్25 పాఠ్యప్రణాళిక అమలు గురించి ప్రస్తావించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండ క్టర్లు, ప్రెసిషన్ అగ్రికల్చర్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశోధనలను ప్రోత్సహించడానికి సిరి, జేఎన్టీయూహెచ్ రెస్పాండ్ వంటి కార్యక్రమాల వివరాలు ఆయన ప్రత్యేకంగా తెలియజేశారు. సుమారు 300 ఉపాధ్యా య ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు.