డెంగ్యూ నివారణకు డ్రైడే
04-08-2026 06:05 PM
గుర్రాలగొంది గ్రామంలో ఇంటింటి అవగాహన
సిద్దిపేట రూరల్: డెంగ్యూ, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను నివారించేందుకు నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో మంగళవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి నీరు నిల్వ ఉండే పాత్రలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇతర వ్యర్థాలను తొలగించాలని ప్రజలకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి దోమల వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆకుల స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించారు.






