దళితుల దీక్షలను అడ్డుకున్న పోలీసులు
04-08-2026 06:00 PM
నిర్మల్,(విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కు ఎంపికైన విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసేందుకు ఆర్డీవో కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన దళితులను పోలీసులు అడ్డుకున్నారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి వచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల ను పోలీసులు అడ్డుకొని దీక్షా శిబిరాన్ని భగ్నం చేశారు. జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతులు లేవని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా తాము న్యాయం కోసం పోరాడుతుంది పోలీసులు అడ్డుకోవడం పై అంబేద్కర్ సంఘ నాయకులు రంజిత్ కుమార్ పోషకుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.






