4 August, 2026 | 9:34 PM

అటవీశాఖ అధికారులపై కేసులు పెట్టాలి

04-08-2026 05:54 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు వేధింపులకు గురిచేస్తూ చట్టాన్ని చేతిలో తీసుకొని చిత్రహింసలు పెట్టిన అధికారులపై కేసులు పెట్టాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకయ్య గారి భూమయ్య డిమాండ్ చేశారు. ఉట్నూరు జన్నారం అటవీ శాఖ అధికారులు సాగు చేసుకుంటున్నా భూముల విషయంలో గిరిజనులపై దాడులు నిర్వహించడం సరికాదు అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై ఈనెల తొమ్మిది లోపల చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తుడుం దెబ్బ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం చేపడతామన్నారు. సంఘం నాయకులు శ్రీనివాస్ పొడుసం గోవర్ధన్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.