22 April, 2026 | 7:02 PM

Breaking News

ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •   బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్‌ తీర్మానం   •   గ్రామాల్లో ఇంటి పన్ను 100% వసూలు చేయాలి   •   బెల్లంపల్లిలో సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆపాలి   •   ఎక్కడి బస్సులు అక్కడే.. రోడ్లెక్కని ఆర్టీసీ బస్సులు   •   ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి   •   ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి   •  

జపాన్ నుంచి తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలత వ్యక్తం

19-11-2025 12:00 AM
  1. బీజేపీ నాయకులు, ప్రముఖ శాస్త్రవేత్త డా. పైడి ఎల్లారెడ్డి 

వారం రోజులపాటు జపాన్‌లో పర్యటన

కామారెడ్డి, నవంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ఈ హబ్ సెంటర్ ను జపాన్ బృందం సందర్శించాలని కోరినట్లు ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. వారం రోజులపాటు జపాన్ దేశంలో పర్యటించినట్లు తెలిపారు. తెలంగాణలో ఐటీ, టెక్నాలజీ వంటి రంగాలలో పెద్ద ఎత్తున సహకారం ఉంటుందని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున దిగ్గజ కంపెనీలు యోచిస్తున్నాయని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలంగా ఉన్నట్లు జపాన్ బృందానికి వివరించినట్లు పైడి ఎల్లారెడ్డి తెలిపారు. పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్, జపాన్ ప్రాంతాల మధ్య శాస్త్ర సాంకేతిక శ్రామిక శక్తి మార్పిడితో అటు జపాన్, భారత సంబంధాలు మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఐ చికెన్ లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టయోటా మోటార్ కంపెనీ కేంద్ర కార్యాలయానికి ప్రధాన  నిలయం అని అన్నారు.

జపాన్ దేశంలో అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఇదే కి ఓముర మాట్లాడుతూ వారి ప్రాంతంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి వారి ప్రాంతంలో చేస్తున్న విశేష సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. అనంతరం పైడి ఎల్లారెడ్డి మీ అసెంబ్లీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి గౌరవింఛీనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆతు చూసి సవాడ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్, అతి సూచి సవాడ, ఫర్ఫెక్ట్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ జపాన్ ఆ ఈచి, కరో కవసీమ చైర్పర్సన్ ఐ చీఫ్ ఫర్ఫెక్ట్ వల్, జపాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.