గుంతలమయంగా జాలిగామ బైపాస్ రోడ్డు
12-08-2026 09:42 AM
గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి రామాయంపేటకు వెళ్లే జాలిగామ బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల అశోక్‌గౌడ్ అన్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి దుస్థితిపై గతంలో పలు కథనాలు వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.






