10 May, 2026 | 1:32 AM

చిక్కుల్లో జైస్వాల్, షెఫాలీ వర్మ

10-05-2026 12:40 AM
  1. ఇద్దరికీ నాడా షోకాజ్ నోటీసులు
  2. డోప్ టెస్టుకు అందుబాటులో లేకపోవడమే కారణం

న్యూఢిల్లీ, మే 9 : భారత స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్, మహిళల జట్టు డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. జాతీ య డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) వీరిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డో పింగ్ పరీక్షల కోసం తమ ఆచూకీ తెలపడం లో విఫలమవ్వడం, అధికారులు పరీక్షల కోసం వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడంతో నాడా ఈ చర్యలు తీసుకుంది. అం తర్జాతీయ క్రీడా నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో ఉన్న ప్రతి అథ్లెట్ తమ రోజువారీ షెడ్యూల్‌ను నాడా యాప్‌లో అప్‌డేట్ చేయాలి.

దీనిని వేర్ అబౌట్స్‌గా పిలు స్తారు. అంటే అధికారులు నోటీసు ఇవ్వకుం డా ఏ సమయంలోనైనా వచ్చి డోపింగ్ శాం పిల్స్ సేకరిస్తారు. జైస్వాల్, షెఫాలీ వర్మలు తాము రిజిస్టర్ చేసిన ప్రదేశాల్లో అధికారులు తనిఖీకి వెళ్లినప్పుడు అక్కడ లేకపో వడంతో దీనిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. క్రీడాకారులకు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ‘వేర్ అబౌట్స్ ఫెయిల్యూర్’ చట్టం ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడుసార్లు ఇలా పరీక్షలకు గైర్హాజ రైతే అది డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయినట్టుగా పరిగణిస్తారు.

నాడా ఇచ్చిన నోటీ సులకు వీరిద్దరూ వివరణ ఇవ్వాల్సి ఉం టుంది. ఒకవేళ వీరు ఇచ్చిన వివరణ సంతృ ప్తికరంగా లేకపోతే విచారణ అనంతరం వీరిద్దరిపై గరిష్టంగా రెండేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం జైస్వాల్ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. అటు భారత మహిళల జట్టుకు సిరీస్‌లు లేకపోవడంతో షెఫాలీ వర్మ విరామంలో ఉంది. ప్ర స్తుతానికి నాడా వీరికి వివరణ ఇచ్చుకోవడానికి కొంత సమయం ఇచ్చింది. తమ ప్రయా ణాలు లేదా అత్యవసర కారణాల వల్ల పరీక్షలకు అందుబాటులో లేమని నిరూపించు కోగలిగితే వీరు ఊపిరి పీల్చుకోవచ్చు. లేని పక్షంలో డోపింగ్ విచారణ కమిటీ ముందు హాజరుకావాల్సి ఉంటుంది.