18 July, 2026 | 6:07 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో

24-05-2026 02:32 PM

న్యూఢిల్లీ: భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశాలని, గల్ఫ్ సంక్షోభం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించామని  అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. భారతదేశంలో పర్యటించడం గర్వంగా ఉందని, ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి నడుస్తోందన్నారు. భారత్, అమెరికా రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే అని, ఇరుదేశాలు వ్యూహాత్మక భాగస్వాములని రూబియో తెలిపారు. గత 48 గంటలుగా గల్ఫ్ ప్రాంతంలోని తామ భాగస్వాములతో కలిసి ముసాయిదా రూపకల్పనపై పనిచేయడంలో మేము కొంత పురోగతి సాధించామని రూబియో వెల్లడించారు. 

ఈ ప్రయత్నం గనుక విజయవంతమైతే, అంతిమంగా మాకు  ఎటువంటి సుంకాలు లేకుండా తెరిచి ఉండే జలసంధులు లభిస్తాయన్నారు. రాబోయే కొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉందని తాను గట్టిగా నమ్ముతున్నానా.  ముఖ్యంగా జలసంధులకు సంబంధించి అంతిమంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తామను ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారో, ఆ స్థితికి చేర్చగల ప్రక్రియకు సంబంధించిందన్నారు.

త్వరలోనే అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత్ కి వస్తారని, ఇరుపక్షాలకు ప్రయోజనకరమైన, సుస్థిరమైన శాశ్వత వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నా. అమెరికా-భారత సంబంధాలు తమ వేగాన్ని ఏమాత్రం కోల్పోలేదని, ప్రపంచంలోని ఏ దేశంతోనైనా మాకున్న సంబంధాలను, భారతదేశంతో మాకున్న వ్యూహాత్మక కూటమికి భంగం కలిగించే విధంగా తాను పరిగణించనుని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు.