19 June, 2026 | 10:55 AM

Breaking News

ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్‌.. ఇంకా వీడని మిస్టరీ   •   అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య   •   పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం   •   సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం   •   నల్గొండలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి   •   పుడమి తల్లి గర్భంలోనే పాడై పోతున్న అంకురం   •   దమ్ముంటే కేసీఆర్‌ ను టచ్ చేసి చూడు..!   •   నియోజకవర్గ రిపోర్టర్లకు జిల్లా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి   •   అక్రమ మొరం తవ్వకాలపై పోలీసుల దాడి.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం   •   మధిరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఓ లకు శిక్షణ   •  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే

19-11-2025 04:32 PM

ఉదండాపూర్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వండి

మా తాత పేరిట ఉన్న భూములు రైతుల పేరిట చేయండి

ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

జడ్చర్ల: నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని సహకారాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఉదంతపూర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించేందుకు జరగబోయే క్యాబినెట్ లో చర్చించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొంత మంది ఇంటి నిర్మాణానికి పునాదులు వేసుకోగా అవి ఇందిరమ్మ యాప్ లో అప్ లోడ్ కాకపోవడం వల్ల వారికి బిల్లులు ఆగిపోయాయని, ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపడం జరిగిందని, ఇందిరమ్మ యాప్ లో ఉన్న సాంకేతిక సమస్యలు తొలగించి ఆ బిల్లులను సత్వరమే క్లియర్ చేయాలని సీఎం దృష్టి తీసుకుపోయినట్లు పేర్కొన్నారు. 

మా తాత పేరిట ఉన్న భూములు రైతుల పేరిట మార్చండి 

రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో తన తాత దేశ్ ముఖ్ పేరిట ఉన్న భూమిని రైతుల పేరిట మార్చడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారని, వాటిపై వెంటనే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని అక్కడే ఉన్న రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి గ కోరిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కోరారు. ఈ విషయంగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.