4 May, 2026 | 3:15 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి స్థాయి వంద పడకలకు పెంపు

10-03-2026 07:19 PM

• గతంలో 100 నుంచి 50 పడకలకు స్థాయి తగ్గింపు

• తాజాగా మళ్లీ 100 పడకల స్థాయి పెంచుతూ ఉత్తర్వులు

• బాలానగర్ ఆస్పత్రిలో పడకల సంఖ్య 23 నుంచి 30 కి పెంపు

• ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి

జడ్చర్ల: జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో పడకల సంఖ్యను 50 నుంచి 100 కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. గతంలో జడ్చర్ల ఆస్పత్రిలోని పడకల సంఖ్యను 50 కు తగ్గిస్తూ గత ఏడాదిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. అయితే పడకల సంఖ్యను తగ్గించిన కారణంగా ఆమేరకు ఆస్పత్రికి కేటాయించే సిబ్బంది, సౌకర్యాలు కూడా తగ్గిపోతాయని ప్రజల్లో ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఈ విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

దీంతో ప్రభుత్వం జడ్చర్ల (బాదేపల్లి) ఆస్పత్రిలో పడకల సంఖ్యను 50 నుంచి 100 కు పెంచుతూ వైద్యవిధాన పరిషత్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. దీంతో జడ్చర్ల ఆస్పత్రికి వంద పడకల ఆస్పత్రికి వచ్చే అన్ని సౌకర్యాలు లభిస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే బాలానగర్ సీహెచ్ సీ లో పడకల సంఖ్యను గతంలో 30 నుంచి 23 కు తగ్గించగా దీన్ని కూడా మళ్లీ 30 పడకలకు పెంచుతూ ప్రభుత్వం వైద్యవిధాన పరిషత్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.