10 March, 2026 | 10:43 PM

రామారెడ్డి మాజీ జెడ్పిటిసి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

10-03-2026 07:14 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మాజీ జెడ్పిటిసి జిల్లా పరిష త్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తుండగా తూప్రాన్ వద్ద అదుపుతప్పి కారు పల్టీ కొట్టి చెట్టుకు ఢీకొంది. కారులో ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు. వారిలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. షబ్బీర్ అలీకి ముఖ్య అనుచరుడుగా ఉన్న నా రెడ్డి మోహన్ రెడ్డి రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన వారు.

ప్రస్తుతం కొంపల్లి లో నివాసం ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కామారెడ్డికి వచ్చి వెళుతుంటారు. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మృతునికి భార్య ,కుమార్తె ఉండగా పెళ్లి చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్లో రామారెడ్డి మండలం నుంచి కాంగ్రెస్ నాయకుడుగా చలామణి అవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేసిన నా రెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చెందడం కామారెడ్డిరెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది.