30 August, 2026 | 3:13 AM

22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

30-08-2026 12:00 AM

మేడ్చల్,ఆగస్టు 29(విజయ క్రాంతి):22-ఏ  నిషేధిత  జాబితాలో చేర్చిన తమ ఆస్తులను అందులో నుంచి తొలగించాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్  కార్యవర్గ సభ్యులు, వివిధ కాలనీల  ప్రతినిధులు, ప్రభావిత ఆస్తుల యజమానులు శనివారం  కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి కి వినతి పత్రం సమర్పిం చారు.

ఈ సందర్భంగా సీతారాం నగర్, బా లరాం నగర్, ఆదర్శ్ నగర్, మల్లికార్జున నగ ర్, కాకతీయ నగర్, డిఫెన్స్ కాలనీ, జుపల్లి హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ, ఆర్.కె. పురం ఆఫీసర్స్ కాలనీ, ఈస్ట్ ఆనంద్బాగ్‌శ్రీనగర్ కాలనీ, అల్వాల్‌శ్రీధామ్ కాలనీ తదితర ప్రా ంతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆస్తులకు సంబంధించిన టైటిల్,

లింక్ డాక్యుమె ంట్లతో పాటు వినతి పత్రాలను కలెక్టర్కు అం దజేశారు. ముఖ్యంగా ఆర్.కె. పురం ఆఫీసర్స్ కాలనీ, డిఫెన్స్ కాలనీతో పాటు సీతారాం నగర్ కాలనీలోని సర్వే నంబర్లు 109, 111కు సంబంధించిన దీర్ఘకాలిక టైటిల్ రికార్డులను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వినతిపత్రాలు,

సమర్పించిన ఆధార పత్రాలను పరి శీలించిన జిల్లా కలెక్టర్ రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.  ఆధార పత్రాలు సమర్పించిన సర్వే నంబర్లను పరిశీలించి, అర్హత ఉన్న నిజమైన ప్రైవేట్ ఆస్తులను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారని వివరించారు.

22 ఏ సమస్యతో పాటు నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.టి. శ్రీనివాసన్, రాఘవేంద్రరావు, అచ్యు త్ రావు, గోపాల్ రెడ్డి, మోహన్ కుమార్,

రఘుదేవ్, మహాపాత్ర, రఫీక్, నరేష్, రాము యాదవ్, డోలి రమేష్, శ్రీధర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, శోభన్ బాబు, శివ యా దవ్, రమేష్, చిందం శ్రీనివాస్, జె.కె. సాయి, రామకృష్ణ, కపిల్ రావు, ఈశ్వరరావు, అనిల్ రెడ్డి, శ్రీనివాస్, రజక సంఘం సభ్యులు కృష్ణ, కిషన్, శంకర్, రాములు, ప్రభావిత కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.