15 May, 2026 | 9:18 PM

Breaking News

హామీల అమలే ప్రభుత్వాల బాధ్యత

13-03-2026 12:00 AM

యాదాద్రి జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): భువనగిరిలో గురువారం ప్రజాపా లన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వాల అసలు బాధ్యత అని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు స్పష్టమైన కార్యాచ రణతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.

అభివృద్ధి పనులు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించేలా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు సమానంగా అభివృద్ధి జరగాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్క రించేందుకు కృషి చేయాలని మల్లన్న సూచించారు.

నేడు వరంగల్‌లో మల్లన్న పర్యటన..

శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పర్యటించనున్నారు.  టీఆర్పి పార్టీ కార్యకర్తలతో కాకతీయ యూనివర్సిటీ రోడ్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రొఫె సర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత రెడ్డి కాలనీ, శారద గార్డెన్స్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్పి పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు హనుమ కొండలోని గోపాలపురం సర్వాయి పాపన్న గౌడ్ జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.