18 July, 2026 | 12:30 AM

మేడ్చల్ ఆర్టీసీ డిపోలోకి బస్సులు వెళ్లాలంటే తిప్పలే..

18-07-2026 12:08 AM

మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నడికొప్పు ఉమా నాగరాజు

మేడ్చల్ అర్బన్, జూలై 17 (విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా మేడ్చల్ ఆర్టీసీ డిపోలోకి బస్సులు వెళ్లాలంటే వర్షపు మురికి నీరు డిపో గేటు ముందు పేరుకుపోవడంతో బస్సులు డిపోలోకి వెళ్లడం లేదని మేడ్చల్ మున్సిపల్ మాజి కౌన్సిలర్ నడికొప్పు ఉమా నాగరాజు ముదిరాజ్ పేర్కొన్నారు.

శుక్రవారం ఆమే మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆవరణలోకి ఆమే వెళ్లి నిలిచిన వర్షపు మురుగు నీటిని పరిశీలించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు.మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆవరణలో వర్షపు మురుగు నీటి సమస్యను తీర్చకపోతే ప్రజలు రోగాల బారిన పడకుండా అధికారులు ముందస్తు చర్యలను తీసుకోవాలని మాజి కౌన్సిలర్ నడికొప్పు ఉమా నాగరాజు వెల్లడించారు.