6 June, 2026 | 5:09 PM

కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలి

06-06-2026 03:51 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డీఐఈఓ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మొక్తాల శాంతన్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ల్యాబ్ సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలలపై అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగన మోని బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్ కుమార్, శివ, నితీష్, మల్లేష్, విష్ణు నాయుడు తదితరులు పాల్గొన్నారు.