23 May, 2026 | 5:25 PM

గ్రామ దీపికల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: సిఐటియు డిమాండ్

23-05-2026 04:57 PM

గ్రామ దీపికలకు కనీస వేతనం 20000 ఇవ్వాలి 

ఉద్యోగ భద్రత కల్పించాలి 

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో తాసిల్దార్ కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్షలో నిర్వహిస్తున్న గ్రామ దీపికలకు సిఐటియు జిల్లా కోశాధికారి చలమాల విఠల్రావు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొలిక పోగు సర్వేశ్వరరావు గ్రామ దీపికల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు మద్దతు తెలియజేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు సేవలందిస్తున్న గ్రామ దీపికల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు.

గ్రామ స్థాయిలో అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ గ్రామ దీపికలకు తగిన వేతనాలు ఉద్యోగ భద్రత సంక్షేమ సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాల సమాచారం అందించడంసర్వేలు నిర్వహించడంవివిధ శాఖల పనుల్లో సహకరించడం వంటి కీలక బాధ్యతలు గ్రామ దీపికలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అయితే వారికి కనీస వేతనం కూడా అందకపోవడం బాధాకరమన్నారు. గ్రామ దీపికలకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పని ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.