23 May, 2026 | 6:03 PM

డీలర్లు చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలి

23-05-2026 05:00 PM

మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ విజయచంద్ర,

మధిర రూరల్ సీఐ మధు

మధిర,(విజయక్రాంతి): డీలర్లు అందరూ విత్తన చట్టం పురుగుమందుల చట్టం ఎరువుల చట్టం లకు లోబడి వ్యాపారం చేయాలని డీలర్లకు మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.విజయచంద్ర, మధిర రూరల్ సీఐ మధు తెలిపారు. శనివారం మధిర పట్టణంలోని రైతు వేదికలో మధిర, ఎర్రుపాలెం  మండలాల ఇన్పుట్ డీలర్లకు సమావేశం నిర్వహించారు. వానాకాలం సమీపిస్తున్న సందర్భంగా డీలర్లు అందరూ విత్తనాలను మంచి కంపెనీల నుంచి తెప్పించి రైతులకు అమ్మాలని దానికి సంబంధించిన ఇన్వాయిసులు ప్రిన్సిపాల్ సర్టిఫికెట్లు, గ్రో అవుట్ రిజల్ట్స్ దగ్గర పెట్టుకోవాలని స్టాక్ రిజిస్టర్ లను ప్రతిరోజు అప్డేట్ చేయాలని డీలర్లకు సూచించారు.

ప్రతి నెల 5వ తారీఖున ఫ్యామిలీలో విత్తన స్టాక్ రిపోర్టును అప్డేట్ చేయాలని ఏడిఏ డీలర్లకు ఆదేశించారు. ఎరువులకు సంబంధించిన ఓ ఫార్ములను లైసెన్స్ లో పొందుపరచుకోవాలని పురుగుమందులకు సంబంధించిన ప్రిన్సిపాల్ సర్టిఫికెట్లు లైసెన్స్ లో పొందుపరచుకోవాలని డీలర్లను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎరువులను పురుగుమందులను మాత్రమే సరఫరా చేయాలని ఎవరైనా నిబంధనలను అతిక్రమించినట్లయితే వారి మీద చర్యలు తీసుకోబడుదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  సాయి  దీక్షిత్ ఎర్రుపాలెం ఏవో సాయి శివ పాల్గొన్నారు