ఆర్టీసీ విలీనం ఒట్టి మాటేనా?
వెంకగారి భూమయ్య :
* ప్రభుత్వ మొండి వైఖరి, బకాయిల ఎగవేత, ప్రైవేటీకరణ దిశగా అడుగులపై నిరసనగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ‘సమరశంఖం’ పూరించింది. ‘చలో సెక్రటేరియట్’ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు రాజధాని బాట పడుతున్నారు.
తెలంగాణ సామాజిక, ఆర్థిక జీవననాడి అయిన తెలంగాణ రాష్ట్ర రో డ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నేడు అత్యంత క్లిష్టమైన సంధి కాలంలో ఉంది. సా మాన్యుడిని గమ్యస్థానాలకు చేర్చే ఈ వారధి ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం, నెరవేరని హా మీల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ప్రజాకర్షక పథకాలతో ప్రజల మన్ననలు పొందాలని చూస్తున్న ప్రభుత్వం, మరోవైపు ఆ పథకాల భారాన్ని మోస్తున్న సంస్థను, దానిపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికుల భవిష్యత్తును విస్మరిస్తోంది.
ఎన్నికల ప్రచార సభల్లో ‘ఆర్టీసీ కార్మికులు నా కుటుంబ స భ్యులు.. అధికారంలోకి రాగానే సంస్థను ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేసి అండగా ఉంటాం’ అని గంభీరంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి పీఠం అధి ష్టించిన తర్వాత ఆ మాటలను తుంగలో తొక్కడంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.
ప్రభుత్వం విఫలం..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రా రంభించిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయా ణ పథకం మహిళల్లో విపరీతమైన ఆదరణ పొందిన మాట వాస్తవమే. నిరుపేద మహిళలకు ఇది ఆర్థిక ఊరటనిస్తోంది. కానీ, ఈ పథకం అమలుకు కావాల్సిన ఆర్థిక వెన్నుముకను అందించడంలో ప్రభుత్వం ఘోరం గా విఫలమయ్యింది. మహిళల ఉచిత ప్ర యాణానికి సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీకి నెలనెలా చెల్లించాల్సిన రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పుడు కొండలా పేరుకుపోయాయి.
క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం, ఈ బకాయిలు ఇప్పటికే రూ.2వేల కోట్ల నుంచి రూ.2,400 కోట్ల మార్కును దాటేశా యి. నెలకు దాదాపు రూ.300 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్న సంస్థకు, ప్రభుత్వం విడతల వారీగా నామమాత్రపు నిధులు వి దుల్చుతూ కాలయాపన చేస్తోంది. దీనివల్ల డీజిల్ బిల్లులు కట్టలేక, బస్సుల టైర్లు, కనీస విడిభాగాల కొనుగోలు చేయలేక డిపో మేనేజర్లు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ ప్రచార కం డూతికి ఒక గొప్ప సంస్థ బలిపశువుగా మా రుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రైవేటుపరం..
ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న తీరు చూస్తుంటే, ఇది సంస్థ అభివృద్ధి కోసమా లేక ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చడానికా అన్న అనుమానాలు బలపడుతున్నా యి. ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో అధిక శాతం ‘గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్’ పద్ధతిలో అద్దెకు తీసుకున్నవే. అంటే బస్సు ప్రైవేట్ యజమానిది, డ్రైవర్ ప్రైవేట్ వ్యక్తి.. కేవలం కండక్టర్ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి. కొత్త బస్సులను సంస్థ ద్వారా స్వయంగా కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, ప్రభుత్వం కా వాలనే అద్దె బస్సులను ప్రోత్సహించడం ద్వారా సంస్థను పరోక్షంగా ప్రైవేట్ పరం చే స్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నా యి.
ఇది ఆర్టీసీ అస్థిత్వాన్ని దెబ్బతీసి, భవిష్యత్తులో వేలాది మంది కార్మికుల ఉపాధిని దె బ్బతీసే ప్రమాదకర పరిణామంగా తయారవుతున్నది. లాభాల మాట అటుంచితే సంస్థ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పగించే ప్రక్రియకు ఇది నాంది అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.తెలంగాణ రాజకీ యాల్లో ఇప్పుడే అసలైన మలుపు మొదలైం ది. రేవంత్ రెడ్డి పాలనలో తమ సమస్యలు పరిష్కారం కాకపోగా, మరింత జటిలమవుతున్నాయని గ్రహించిన కార్మికులు.. ఇప్పు డు బహిరంగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారు.
ఆత్మగౌరవం తాకట్టు..
గత ప్రభుత్వ హయాంలో సమ్మెలు, తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ, కేసీఆర్ ప్రభు త్వం చివరి దశలో సంస్థ విలీన ప్రక్రియకు చట్టబద్ధమైన పునాది వేసిందని కార్మికులు బలంగా నమ్ముతున్నారు. ‘కేసీఆర్ కనీసం జీతాలు, డీఏల విషయంలో మాకు కొంత భరోసా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం హామీలతో ఊరించి ఇప్పుడు ఉరివేస్తోంది’ అని ఒక సీనియర్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేయ డం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.
నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద తిరుగుబా టు చేసిన అదే కార్మికులే నేడు కష్టాలున్నా ఆయనే పాలన నయం కదా అని పొగడటం చూస్తుంటే, రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో గూడుకట్టుకుందనేది స్పష్టంగా అర్థమవుతోంది.ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, అవి వారి హక్కులు. 2017 పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నా యి. పదికి పైగా కరువు భత్యాలు కార్మికులకు అందాల్సి ఉంది.
రిటైర్డ్ ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్ నిధులను ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుని వారికి తిరిగి చెల్లించకపోవడం మరీ దారుణం. జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న కష్టార్జితం కోసం, వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించింది. విలీనం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా, మేనిఫెస్టో సాక్షిగా చెప్పి ఇప్పుడు మౌనం వహించడం కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.
ఆర్టీసీ జేఏసీ పోరాటం..
ప్రభుత్వ మొండి వైఖరి, బకాయిల ఎగవేత, ప్రైవేటీకరణ దిశగా అడుగులపై నిరస నగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ‘సమర శంఖం’ పూరించింది. ‘చలో సెక్రటేరియట్’ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కా ర్మికులు రాజధాని బాట పడుతున్నారు. ఇది కేవలం ఒక నిరసన ప్రదర్శన కాదు. దశాబ్దా ల చరిత్ర కలిగిన ఒక ప్రజారవాణా సంస్థను కాపాడుకోవడానికి జరుగుతున్న చారిత్రక పోరాటం.ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అది వికటించే అవకాశ ముంది.
ఇప్పటికైనా సీఎం రేవంత్ తన ‘నీటి మూటల’ హామీలను పక్కన పెట్టి, వాస్తవికతను గుర్తించాలి. ఆర్టీసీని కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయ సాధనంగా చూడకుండా, ఒక సేవా సంస్థగా గుర్తించి ఆదుకోవాలి. పే రుకుపోయిన బకాయిలను వెంటనే విడుద ల చేసి, డీజిల్ నిర్వహణ ఖర్చులకు నిధులు కేటాయించాలి. ముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం సంస్థ విలీన ప్రక్రియను వేగవంతం చేసి కార్మికుల్లో భరోసా నింపాలి. లేదంటే, అక్షర బద్ధమైన ఈ కార్మికుల ఆగ్రహం ప్రభుత్వ పునాదులను కదిలించడం ఖా యం. ప్రజాస్వామ్యంలో ప్రజల, కార్మికుల ఆవేదనను విస్మరించిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించిన చరిత్ర లేదు.
వ్యాసకర్త సెల్: 9848559863




